LIVE : హైదరాబాద్‌లో దళిత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో కేటీఆర్ - ప్రత్యక్ష ప్రసారం
Minister KTR LIVE : రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ను మూడోసారి గెలిపించడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందు నుంచే అనేక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సభలు నిర్వహించి.. అందులో పాల్గొన్నారు. కేసీఆర్‌ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయడమే తన లక్ష్యంగా కేటీఆర్ ముందుకు సాగుతున్నారు. కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా? అనే నినాదంతో ప్రజల ముందుకు కేటీఆర్ వెళుతున్నారు. అలాగే ఒకవైపు సీఎం కేటీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో ప్రజల ముందుకు వెళ్లగా.. హరీశ్‌రావు ఆత్మీయ సభలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. అలాగే మంత్రి కేటీఆర్ సైతం నియోజకవర్గాల్లో జరుగుతున్న బీఆర్ఎస్ సభలకు వెళుతూ.. రోడ్ షోలలో పాల్గొంటున్నారు. చిట్యాలలో రోడ్ షోలో పాల్గొన్న అనంతరం కేటీఆర్.. ఎల్బీనగర్ వద్ద నాగోల్‌లో తెలంగాణ టెక్స్టైల్ హ్యాండ్లూమ్ కార్మికుల సదస్సులో (Telangana Textile Handloom Workers Conference) పాల్గొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం తీసుకున్న, తీసుకోబోయే చర్యల గురించి వివరిస్తున్నారు.