LIVE : ఎల్బీనగర్లో మంత్రి కేటీఆర్ రోడ్ షో - ప్రత్యక్షప్రసారం
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ను మూడోసారి గెలిపించడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్(Minister KTR) సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందు నుంచే అనేక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సభలు నిర్వహించి.. అందులో పాల్గొన్నారు. కేసీఆర్‌ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయడమే తన లక్ష్యంగా కేటీఆర్ ముందుకు సాగుతున్నారు. కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా? అనే నినాదంతో ప్రజల ముందుకు కేటీఆర్ వెళుతున్నారు.
అలాగే ఒకవైపు సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో ప్రజల ముందుకు వెళ్లగా.. హరీశ్‌రావు ఆత్మీయ సభలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. అలాగే మంత్రి కేటీఆర్ సైతం నియోజకవర్గాల్లో జరుగుతున్న బీఆర్ఎస్ సభలకు వెళుతూ.. రోడ్ షోలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిర్వహించే రోడ్‌షోలలో పాల్గొన్నారు. ఆలేరులో నిర్వహించే రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రస్తుతం భువనగిరిలోని వలిగొండలో ప్రసంగిస్తున్నారు. ఆ తర్వాత మిర్యాలగూడ రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతంఉప్పల్లో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించారు. అనంతరం ఎల్బీ నగర్ లో రోడ్ షోలో పాల్గొన్నారు.