LIVE : కొత్తగూడెంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో - ప్రత్యక్షప్రసారం
Published: Nov 19, 2023, 10:20 AM

Minister KTR at Women Ask program LIVE : రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ను మూడోసారి గెలిపించడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్(Minister KTR) సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందు నుంచే అనేక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సభలు నిర్వహించి.. అందులో పాల్గొన్నారు. కేసీఆర్‌ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయడమే తన లక్ష్యంగా కేటీఆర్ ముందుకు సాగుతున్నారు. కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా? అనే నినాదంతో ప్రజల ముందుకు కేటీఆర్ వెళుతున్నారు.
Minister KTR LIVE : అలాగే ఒకవైపు సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో ప్రజల ముందుకు వెళ్లగా.. హరీశ్‌రావు ఆత్మీయ సభలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. అలాగే మంత్రి కేటీఆర్ సైతం నియోజకవర్గాల్లో జరుగుతున్న బీఆర్ఎస్ సభలకు వెళుతూ.. రోడ్ షోలలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ బేగంపేటలోని గ్రాండ్ కాకతీయలో 'విమెన్ ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం' లో భాగంగా మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం 11:00 గంటలకు భద్రాచలం రోడ్ షోలో పాల్గొననున్నారు. అలాగే మధ్యాహ్నం 1:00 గంటలకు ఇల్లందు రోడ్ షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 గంటలకు కొత్తగూడెం రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. సాయంత్రం 4:00 గంటలకు మంత్రి కేటీఆర్ అశ్వారావుపేట రోడ్ షోలో పాల్గొంటారు.