LIVE : జడ్చర్ల బహిరంగ సభలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
Published: May 27, 2023, 11:58 AM

Harishrao Live : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ తమ వ్యూహాలకు ఇప్పటి నుంచే పదునుపెట్టింది. ఈ క్రమంలో గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ ముందుకు సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇప్పటికే సచివాలయంలో వరుస సమీక్షలతో బిజీబిజీగా గడుపుతున్నారు. మరో వైపు మంత్రులు, అధికారులకు ప్రజాసమస్యలు, సంక్షేమ పథకాలు అందే విషయంలో దృష్టిసారించాలని దిశా నిర్దేశం చేశారు. మంత్రులు ఆయా శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఒకవైపు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూనే, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. అలాగే నిర్మాణం పూర్తి చేసుకున్న పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఇవాళ మహబూబ్‌నగర్ పర్యటనకు వెళ్లారు. ఇక్కడ నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన హరీశ్‌రావు దేశంలో ఇప్పటికే ఉత్తమ వైద్య సేవల విభాగంలో మూడో స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలుపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.