LIVE : మంత్రి హరీశ్‌రావు మీట్ ది ప్రెస్ - ప్రత్యక్ష ప్రసారం
Published: Nov 15, 2023, 11:26 AM

Minister Harish Rao meet the press Live : రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించాయి. అధికారమే లక్ష్యంగా పార్టీలన్నీ వ్యూహాలను రచిస్తున్నాయి. ప్రధాన పార్టీ ముఖ్య నాయకులు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వివిధ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి తమ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ మళ్లీ అధికారం కోసం ప్రజలను అభ్యర్థిస్తుండగా.. కాంగ్రెస్, బీజేపీ తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి.
Harish Rao MEDIA Conference Live : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ జోరుగా కొనసాగిస్తున్నాయి. ప్రముఖ నాయకుల పర్యటనతో నాయకుల్లో, కార్యకర్తల్లో హుషారు నింపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ మూడో విడత ప్రచార షెడ్యూల్ భాగంగా రోజుకు మూడు, నాలుగు సభల్లో పాల్గొంటున్నారు. అనంతరం బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు కేటీఆర్ పలు సభల్లో పాల్గొంటు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరో ముఖ్య నాయకుడు మంత్రి హరీశ్‌రావు సభల్లో పాల్గొంటూ, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.