LIVE : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్మిక శాఖ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు- ప్రత్యక్షప్రసారం
Minister Harish Rao LIVE : రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలన్ని ప్రచారంలో మునిగిపోయాయి. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం జోరుగా ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పలు వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారంలో ముందంజంలో ఉంది. మరోవైపు సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలతో.. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అలానే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ప్రచారంలో భాగంలో రోడ్‌షోలతో పలు జిల్లాలో చుట్టేస్తూ.. హోరెత్తిస్తున్నారు. కేసీఆర్‌ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయడమే తమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా? అనే నినాదంతో ప్రజల ముందుకు వెళుతున్నారు.
Harish Rao With BRS Leaders LIVE : ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఇవాళ తెలంగాణ భవన్‌లోని బీఆర్ఎస్ కార్మిక విభాగం సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలితో విమర్శల వర్షం కురిపించారు. బీజేపీపై కూడా పలు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతులను ముంచాలని చూస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మళ్లీ హస్తం పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ 50 ఏళ్లు వెనక్కి వెళ్లడం గ్యారెంటీ అని హరీశ్‌రావు అన్నారు.