LIVE : హైదరాబాద్లో బీజేపీ నేతల మీడియా సమావేశం- ప్రత్యక్షప్రసారం
BJP Party LIVE News : రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబపాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని.. బీజేపీ నేతలు పేర్కొన్నారు. నేడు తెలంగాణ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని.. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను, యువకులను, అన్ని వర్గాల వారిని మోసం చేసిందని ధ్వజమెత్తారు. ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీసీ వర్గానికి కమలం పార్టీ పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామన్నారు.
Telangana BJP president Kishan Reddy Live : తెలంగాణ ప్రజలు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలన్నారు. మరోసారి బీఆర్ఎస్కు ఓటేస్తే.. కుటుంబపాలన చేతిలో కట్టబెట్టినట్టేనన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు. కాళేశ్వరంలో ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతికి పాల్పడటంతో పిల్లర్లు కుంగి.. లక్ష కోట్లు గోదావరి పాలు చేశారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ను గద్దెదించి.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ నాయకులు జాతీయ నాయకులతో సభలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్ర మంత్రులు సహా ఎన్నికల ప్రచారాల కోసం రాష్ట్రానికి రానున్నారు. ఇప్పటికే బీజేపీ నాయకులు నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేస్తామని.. ఇతర ప్రకటనలు చేశారు.