LIVE : నాంపల్లి మల్లేపల్లి చౌరస్తాలో కేటీఆర్ రోడ్ షో - ప్రత్యక్షప్రసారం
Published: Nov 18, 2023, 12:54 PM

KTR Road Show at Kamareddy Today Live : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాలు, వివిధ సంఘాలతో సమావేశాలు, రోడ్ షోలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సమావేశాల్లో ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో తొమ్మిదన్నరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఈ ప్రగతి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. మొన్నటిదాక నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన కేటీఆర్.. ఇప్పుడు రోడ్ షోలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మొదటగా కామారెడ్డిలో రోడ్‌షో నిర్వహించారు. సాయంత్ర 5 గంటలకు నాంపల్లిలో, రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్‌లో కేటీఆర్ రోడ్‌షోలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వెన్నుపోటు పొడిచే హస్తం నేతలను నమ్మి ఓటు వేస్తే గుండెపోటు రావడం ఖాయమని అన్నారు.