LIVE : కేపీహెచ్బీలో కేటీఆర్ రోడ్ షో - ప్రత్యక్షప్రసారం
KTR Road Show Live : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు ఎన్నికల ప్రచారం జోరుగా ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. నేటి నుంచి నగరంలో కేటీఆర్ రోడ్ షోలు మొదలు కానున్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వివిధ సమావేశాలు నిర్వహించిన ఆయన.. నేటి నుంచి సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి సుమారు 9 గంటల వరకు రోజుకు రెండు నియోజకవర్గాల్లో కేటీఆర్ ప్రచారం కొనసాగనుంది. ఇవాళ్టి నుంచి ఈనెల 20 వరకు మొదటి విడతలో గ్రేటర్ హైదరాబాద్‌లోని 11 నియోజకవర్గాల్లో రోడ్ షోలకు ఆయన ప్రణాళిక చేశారు. నేడు కేటీఆర్ కూకట్‌పల్లిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన చేవెళ్ల రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తున్నారు. అక్కడినుంచి హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొననున్నారు.