LIVE : తంగళ్లపల్లిలో మంత్రి కేటీఆర్ రోడ్ షో - ప్రత్యక్ష ప్రసారం
Published: Nov 15, 2023, 12:51 PM

KTR Road Show Live : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు ఎన్నికల ప్రచారం జోరుగా ముందుకు సాగుతున్నారు. ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రోడ్‌షోలతో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. రోజూ ఉదయం 11 నుంచి రాత్రి సుమారు తొమ్మిది గంటల వరకు కేటీఆర్ ప్రచారం కొనసాగనుంది. ఈనెల 20 వరకు మొదటి విడతలో గ్రేటర్ హైదరాబాద్‌లోని 11 నియోజకవర్గాలు సహా 29 ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఇవాళ సిరిసిల్లలో కేటీఆర్ పర్యటిస్తున్నారు. వేములవాడ నియోజకవర్గాల్లోని కథలాపూర్, మేడిపల్లి, కోనరావుపేట, వేములవాడ, తంగలపల్లిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగిస్తున్నారు.
KTR road show Schedule : గురువారం రోజున.. చేవెళ్ల, వికారాబాద్, మర్పల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్‌లో కేటీఆర్ పర్యటిస్తారు. ఈనెల 17న మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌లో ప్రచారం జరగనుంది. ఈనెల 18న రామగుండం, కొత్తగూడెం, నాంపల్లి, గోషామహల్, సికింద్రాబాద్‌లో ఈనెల 19న భద్రాచలం, ఇల్లందు, ఖమ్మం, అంబర్ పేట, ముషీరాబాద్, 20వ తేదీన ఆలేరు, మిర్యాలగూడ, ఉప్పల్, ఎల్బీనగర్లో పర్యటించనున్నారు.