LIVE : బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్
Published: Nov 17, 2023, 10:42 AM

KTR Road Show Live : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాలు, వివిధ సంఘాలతో సమావేశాలు, రోడ్ షోలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సమావేశాల్లో ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో తొమ్మిదన్నరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఈ ప్రగతి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. మొన్నటిదాక నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన కేటీఆర్.. ఇప్పుడు రోడ్ షోలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మంచిర్యాలలో ఇవాళ కేటీఆర్ పర్యటించనున్నారు. మంచిర్యాల, జన్నారంలలో రోడ్ షోలో పాల్గొననున్నారు. అయితే అంతకంటే ముందుగా ఆయన హైదరాబాద్లో మరో సమావేశంలో పాల్గొన్నారు. నగరంలోని క్షత్రియ హోటల్లో నిర్వహించిన బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన తెలంగాణలో రియల్ ఎస్టేట్, ఇతర రంగాల్లో జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు.