LIVE: నాందేడ్‌లో BRS శిక్షణ శిబిరం.. పాల్గొన్న సీఎం కేసీఆర్
Published: May 19, 2023, 1:53 PM

KCR Interaction With BRS Activists : మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలకు రెండు రోజుల పాటు జరగనున్న రాజకీయ శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. శిక్షణ శిబిరాల్లో మహారాష్ట్ర నాయకులకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీ కొంతకాలంగా వివిధ పార్టీల నుంచి నాయకులు చేరారు. మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాల కన్వీనర్లు, కో ఆర్డినేటర్లు, ముఖ్యమైన మహిళ కార్యకర్తలు, రైతు నేతలు శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ లక్ష్యాలను శిక్షణ శిబిరాల్లో వివరించారు. తెలంగాణ మోడల్ మహారాష్ట్రకు ఎందుకు అవసరమనే అంశాన్ని ప్రస్తావించారు. కాగా ఈసారి మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్ల సీఎం కేసీఆర్ తెలంగాణలో ముఖ్య పథకాలైనా రైతు బంధు, దళిత బంధు, కల్యాణ లక్ష్మి లాంటి పథకాలను ఎన్నికల ప్రచారంలో అస్త్రంగా ఉపయోగించనున్నారు. అబ్ కే బార్ కిసాన్ సర్కార్ నినాదం ఉద్దేశ్యాలను వివరించారు. ఇంటింటికీ ప్రచారం నిర్వహించేలా వ్యూహరచన చేశారు. ప్రచార సామగ్రిని పంపిణీ చేశారు.