LIVE : మల్కాజ్గిరిలో జేపీ నడ్డా రోడ్ షో - ప్రత్యక్షప్రసారం
JP Nadda Live : తెలంగాణ గడ్డపై కాషాయజెండా ఎగురవేయడమే లక్ష్యంగా కమలనాథులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని కాషాయదళం ముమ్మరం చేయనుంది. ఇప్పటికే అగ్రనేతలతో ఒక దఫా ప్రచారాన్ని పూర్తి చేసిన బీజేపీ.. మరో దఫా ప్రచారానికి ప్లాన్ చేస్తోంది. నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు తెలంగాణకు వరుస కడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో కీలక నేతలు కూడా రోజూ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారానికి పది రోజులే ఉండడంతో జాతీయ నాయకులతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. తాజాగా నేడు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. అనంతరం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ఏర్పాటు చేసిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో జేపీ నడ్డా పాల్గొన్నాారు. ప్రస్తుతం నడ్డా మల్కాజ్గిరిలో రోడ్ షో నిర్వహిస్తున్నారు.