LIVE : గాంధీభవన్ నుంచి ప్రత్యక్ష ప్రసారం
Telangana Congress Gandhi Bhavan Live : ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల నేతల మాటల్లో పదును పెరుగుతోంది. సుడిగాలి పర్యటనలు, రోడ్ షోలు, ములాఖత్‌లు పెరుగుతున్నాయి. దిల్లీ నుంచి పార్టీ అగ్రనేతల తాకిడి ఎక్కువైంది. మొన్న రాహుల్ గాంధీ తెలంగాణ రాగా.. నిన్న అమిత్ షా వచ్చారు. ఇవాళ ప్రియాంక గాంధీ, బీజేపీ నుంచి జేపీ నడ్డా ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరోవైపు అమిత్ షా రేపు కూడా మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఇక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సుడి గాలి పర్యటనలతో అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. రోడ్ షోలతో వీలైనంత మంది ఓటర్లను కలుస్తూ కాంగ్రెస్ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విజయశాంతి.. గాంధీ భవన్‌కు వచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలపై ఆమె విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. రాష్ట్రాన్ని కేసీఆర్, కేంద్రంలో మోదీ.. తెలంగాణకు చేసిందేమీ లేదని మండిపడ్డారు.