LIVE : జడ్చర్లలో కాంగ్రెస్ బహిరంగ సభ.. ప్రత్యక్ష ప్రసారం
Published: May 25, 2023, 7:19 PM

Congress Public Meeting in Jadcherla : కర్ణాటక ఎన్నికల ఫలితాలతో జోష్ మీదున్న కాంగ్రెస్.. రాష్ట్రంలోనూ విజయబావుటా ఎగురవేయాలని భావిస్తోంది. ఇందుకోసం తరచుగా సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఒకవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తుండగా.. మరోవైపు పీసీసీ నేతృత్వంలో సభలతో జనానికి చేరువ కావాలని నిర్ణయించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 800 కిలోమీటర్లకు చేరుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో భారీ సభను ఏర్పాటు చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో నిర్వహిస్తున్న మొదటి బహిరంగసభను హస్తం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభకు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్సింగ్ సుఖ్ హాజరయ్యారు. తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా కిీలక నేతలు పాల్గొన్నారు.