LIVE : హైదరాబాద్ గాంధీభవన్లో కాంగ్రెస్ నేతల మీడియా సమావేశం- ప్రత్యక్షప్రసారం
Congress Leaders Live : రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా.. కాంగ్రెస్(Congress) పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది. ఇప్పటికే కొనసాగిస్తున్న ప్రచారాన్ని.. హస్తం పార్టీ అగ్రనేతలతో మరింత వేగంవంతం చేయాలని నిర్ణయించింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున ఆయా రాష్ట్రాల్లో.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు జాతీయ స్థాయినేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తెలంగాణ మినహా మిగిలిన 4 రాష్ట్రాల్లో ప్రచారం.. తుది దశకు చేరుకోనుంది. ఇక తెలంగాణలోనూ ప్రచారం చేయడానికి.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 17న రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో వివిధ తేదీల్లో ఆరు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.తెలంగాణపై ఏఐసీసీ పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఇప్పటికే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్.. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితి, రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారం.. నేతల మధ్య అంతరాలు వంటి అంశాలపై ఏఐసీసీ ప్రత్యేక పరిశీలకులతో సమీక్షించారు. తాజాగా హైదరాబాద్ గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.