LIVE : నల్గొండ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ - ప్రత్యక్షప్రసారం
CM KCR praja ashirvada sabha Live : తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగిపోయాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పలు వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో విడత ప్రచార పర్వానికి తెరలేపారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొంటున్నారు.
రెండు రోజులు మినహా.. మిగిలిన రోజుల్లో నాలుగు, మూడు నియోజకవర్గాలను సీఎం చుట్టేసేలా షెడ్యూల్ రూపొందించారు. ఈ క్రమంలోనే నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా కరీంనగర్ జిల్లా మానకొండూరు సభలో సీఎం పాల్గొన్నారు. అనంతరం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ సభకు హాజరై.. ప్రస్తుతం నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై పలు విమర్శలు చేస్తూ.. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ అధినేత ముందుకు సాగుతున్నారు.