LIVE : పరకాల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ - ప్రత్యక్ష ప్రసారం
CM KCR praja ashirvada sabha live From Haliya : తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలన్ని ప్రచారంలో మునిగిపోయాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పలు వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో విడత ప్రచార పర్వానికి తెరలేపారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొంటున్నారు. రెండు రోజులు మినహా.. మిగిలిన రోజుల్లో నాలుగు, మూడు నియోజకవర్గాలను సీఎం చుట్టేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. తొలుత కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. అనంతరం చొప్పదండి, జమ్మికుంట, హుజురాబాద్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొంటారు.