LIVE : మెదక్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ - ప్రత్యక్ష ప్రసారం
CM KCR Public Meeting in Bodhan Live : నామినేషన్ల ఘట్టం, దీపావళి పండుగ పూర్తి కావడంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం మరింత జోరందుకుంది. ఆఖరి రోజు వరకు నిర్విరామంగా కేసీఆర్.. ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. రెండు రోజులు మినహా.. మిగిలిన రోజుల్లో నాలుగు, మూడు నియోజకవర్గాలను సీఎం చుట్టేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభల్లో భాగంగా ఇవాళ నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటారు.
BRS Election Campaign 2023 LIVE : ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ బోధన్‌లో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సభలో ప్రసంగిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై పలు విమర్శలు చేస్తూ.. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపై పలు విమర్శలు చేస్తున్నారు. అనంతరం నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు కేసీఆర్ హాజరవ్వనున్నారు.