LIVE : సిద్దిపేట జిల్లా చేర్యాలలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ - ప్రత్యక్షప్రసారం
నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం మరింత జోరందుకుంది. ఆఖరి రోజు వరకు నిర్విరామంగా.. ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. రెండు రోజులు మినహా.. మిగిలిన రోజుల్లో మూడు, నాలుగు నియోజకవర్గాలను సీఎం చుట్టేయనున్నారు. ప్రచారంలో భాగంగా నేడు సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడుతున్నారు.
జనగామ నియోజకవర్గం పరిధి సిద్దిపేట జిల్లా చేర్యాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు నేతలు సర్వం సిద్ధం చేశారు. సభ విజయవంతం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒకే నియోజకవర్గం పరిధిలో రెండోసారి సీఎం హాజరు కానుండటంతో సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించారు. దాదాపు లక్ష మంది హాజరైన ఈ సభలో.. ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కావాల్సిన మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు పగాల సంపత్ రెడ్డి తెలిపారు.