LIVE : నర్సాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ - ప్రత్యక్షప్రసారం
ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో విడత ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై పలు విమర్శలు చేస్తూ.. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ అధినేత ముందుకు సాగుతున్నారు. నేడు 4 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం పాల్గొననున్నారు. ముందుగా ఆదిలాబాద్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ ప్రసంగించారు. ఈ సభ అనంతరం బోథ్ సభలో పాల్గొన్నారు. ఆపై నిజామాబాద్ రూరల్ సభలో మాట్లాడారు. ఈ మీటింగ్ అనంతరం నర్సాపూర్ సభలో పాల్గొని మాట్లాడుతున్నారు.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, పార్టీ నాయకులు పూర్తి ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇది వరకే జిల్లాలోని బోధన్, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డిలో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిన కేసీఆర్.. ఇవాళ నిజామాబాద్ రూరల్లో నిర్వహించే సభకు హాజరు కానున్నారు. సభాస్థలిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.