LIVE : ఇబ్రహీంపట్నం ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్- ప్రత్యక్ష ప్రసారం
CM KCR praja ashirvada sabha live From Haliya : నామినేషన్ల ఘట్టం, దీపావళి పండుగ పూర్తికావడంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం ఆఖరి రోజు వరకు నిర్విరామంగా ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. రెండు రోజులు మినహా.. మిగిలిన రోజుల్లో నాలుగు, మూడు నియోజకవర్గాలను సీఎం చుట్టేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభల్లో భాగంగా ఇవాళ మూడు బహిరంగ సభల్లో పాల్గొంటారు.
BRS Election Campaign 2023 LIVE : ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ పాలకుర్తిలో ఏర్పాటు చేసే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. ఈ సభలో ప్రసంగిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై పలు విమర్శలు చేస్తూ.. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపై పలు విమర్శలు చేస్తున్నారు. అనంతరం హాలియా, ఇబ్రహీంపట్నంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు కేసీఆర్ హాజరవ్వనున్నారు.