LIVE : హైదరాబాద్లో నిర్మలా సీతారామన్ ప్రెస్మీట్
తెలంగాణలో ప్రచారానికి గడువు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రానికి జాతీయ పార్టీల అగ్రనేతల రాకపోకలు పెరిగాయి. ఆదివారం జేపీ నడ్డా, ప్రియాంక గాంధీ రాగా.. సోమవారం అమిత్ షా వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. ఇవాళ ఆ పార్టీకే చెందిన సీనియర్ నేత, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణలోని పలు నియోజక వర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్ కత్రియా హోటల్లోని పార్టీ మీడియా సెంటర్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అవినీతికి కేరాఫ్ గా మారిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని నిర్మలా సీతారామన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టులు, స్కీముల్లో జరిగిన స్కాములపై విచారణ జరిపిస్తామని ఆమె హామీ ఇచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే రాష్ట్రాలు, దేశం అభివృద్ధి చెందుతాయని.. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఆ అభివృద్ధి ఫలాలు కనిపిస్తున్నాయమని నిర్మలా సీతారామన్ తెలిపారు.