LIVE : హుస్నాబాద్‌లో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం- ప్రత్యక్ష ప్రసారం
Bandi Sanjay Roadshow in Husnabad LIVE : ఎన్నికలకు సమయం దగ్గరవుతున్న కొద్ది.. పార్టీల ప్రచారాల ఉద్ధృతి పెరుగుతోంది. దీపావళి వేడుకలు కూడా ముగియడంతో.. ఇవాళ రాష్ట్రంలో అన్ని పార్టీల నేతల సుడిగాలి పర్యటనలు చేపట్టారు. బీజేపీ అగ్రనేత బండి సంజయ్ ఇవాళ హుస్నాబాద్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారు. నేడు కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అవినీతిమయంగా మారిందని తెలంగాణ అభివృద్ధి సాగాలంటే.. బీజేపీకే పట్టం కట్టాలని ఆయన ఓటర్లను కోరారు. మోదీ సర్కార్ నేతృత్వంలో కేంద్రం నుంచి అదనపు నిధులు తీసుకొచ్చి.. రాష్ట్రాన్ని ప్రగతి బాటలో పయనించేలా చేసేందుకు తాను కంకణం కట్టుకున్నామని తెలిపారు. బీజేపీ మేనిఫెస్టో విడుదల కోసం ఈనెల 17న పార్టీ అగ్రనేత అమిత్ షా రానున్నారని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే అమ్ముకున్నట్లేనని.. వారి గత పాలనను ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలని బండి సూచించారు. ఒక్కసారి బీజేపీకి అవకాశమిచ్చి చూడండని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.