LIVE : భైంసాలో బీజేపీ సభలో బండి సంజయ్ - ప్రత్యక్ష ప్రసారం
Bandi Sanjay At Bhainsa public Meeting : తెలంగాణ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రచార స్పీడును పెంచాయి. బీజేపీ నాయకులు తమ బీసీ సీఎం నినాదంతో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా 7 ప్రధాన అంశాలతో బీజేపీ మేనిఫెస్టోని విడుదల చేయనున్నారు. ఇప్పటికే అగ్రనాయకులతో ప్రచారాన్ని చేసిన బీజేపీ నాయకులు మరోసారి వారితో ప్రచారానికి సిద్ధమయ్యారు. బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణతో బీజేపీ నాయకులు తమ ప్రచార స్పీడును పెంచారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో బైపాస్ రోడ్డు సమీపంలో బీజేపీ నాయకులు నిర్వహించే సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఈ సభకు ముఖ్యాతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలో జన సమీకరణ నాయకులపై బీజేపీ నేతలు దృష్టి సారిస్తున్నారు. భైంసాలో నిర్వహించబోయే సభకు 7 మండలాల నుంచి ప్రజలు రానున్నారని నాయకులు తెలిపారు.