LIVE : చొప్పదండిలో బండి సంజయ్ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం
Published: Nov 11, 2023, 12:20 PM

Bandi Sanjay Live : తెలంగాణ గడ్డపై కాషాయజెండా ఎగురవేయడమే లక్ష్యంగా కమలనాథులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని కాషాయదళం ముమ్మరం చేయనుంది. ఇప్పటికే అగ్రనేతలతో ఒక దఫా ప్రచారాన్ని పూర్తి చేసిన బీజేపీ.. మరో దఫా ప్రచారానికి ప్లాన్ చేస్తోంది. ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రప్పిస్తోంది. ఇవాళ జరిగే సభకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు తెలంగాణకు వరుస కట్టనున్నట్లు కమలం శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కీలక నేతలు కూడా రోజూ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బండి సంజయ్ కరీంనగర్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇస్తే.. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తుందని అంటున్నారు. ఈ ప్రచారంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కరీంనగర్ జిల్లాలోని గంగాధర, చొప్పదండిలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.