LIVE : ఉప్పల్‌లో అమిత్ షా రోడ్ షో - ప్రత్యక్షప్రసారం
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. సభలు, సమావేశాలతో దూసుకుపోతుంది. బీజేపీ అభ్యర్థుల తరఫున కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగి ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, పీయూష్ గోయల్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ శావంట్, ఖుష్బూ, స్మృతి ఇరానీ, సాధ్వీ నిరంజన్ జ్యోతి ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచార సభల్లో పాల్గొన్నారు. పోలింగ్ సమయం దగ్గర పడటంతో పెద్దఎత్తున ప్రచారం నిర్వహించేందుకు బీజేపీ నాయకత్వం ప్లాన్ చేసింది.
మోదీ, అమిత్ షా, నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కేంద్రమంత్రులు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు నేడు రాష్ట్రానికి రానున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ జనగామలో ఏర్పాటు చేసిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సభ అనంతరం కోరుట్ల సభలో పాల్గొన్నారు. కోరుట్ల సభను ముగించుకుని ఉప్పల్‌కు చేరుకొని బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తరఫున రోడ్ షో నిర్వహిస్తున్నారు.