డ్రైవర్ నిర్లక్ష్యం.. టిప్పర్ కింద పడి ఓ వ్యక్తి మృతి
డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల టిప్పర్ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కనకమామిడిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

డ్రైవర్ నిర్లక్ష్యం.. టిప్పర్ కింద పడి ఓ వ్యక్తి మృతి
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో టిప్పర్ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పంటపొలాల్లోకి దారిని వేస్తున్న క్రమంలో టిప్పర్ను రివర్స్ తీస్తుండగా ఈ ఘటన జరిగింది.
డ్రైవర్ నిర్లక్ష్యమే వెంకటస్వామి మృతికి కారణమని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

