దా'రుణ' యాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం... రూ.320 కోట్లు సీజ్
లోన్‌యాప్‌ల కేసులో హైదరాబాద్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు 20 మందిని అరెస్ట్ చేశామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. రూ.320 కోట్లు నిలుపుదల చేశామని సీపీ వెల్లడించారు.

hyderabad cp anjani kumar on loan apps case investigation
లోన్‌యాప్స్ కేసులో ఇప్పటి వరకు 20 మందిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. గుడ్‌గావ్, బెంగళూరు సహా 9 రాష్ట్రాల్లో కేసు దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఇప్పటివరకు 320 కోట్ల రూపాయలు ఖాతాలు నిలుపుదల చేశామన్నారు.
గేమింగ్ ఫ్రాడ్‌లో హాంకాంగ్ చైనా అకౌంట్లకు రూ.105 కోట్లు బదిలీ జరిగినట్లు గుర్తించామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. దర్యాప్తు వేగంగా జరుగుతోందని.. వీలైనంత వరకు అందరు నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
దా'రుణ' యాప్ కేసులో ముమ్మర దర్యాప్తు... 320 కోట్ల ఖాతాలు నిలిపివేత

