రష్యా పౌరులకు ఇకపై వీసా ఉంటేనే అనుమతి: జెలెన్​స్కీ

author img

By

Published : Jun 17, 2022, 5:56 PM IST

Volodymyr Zelenskyy

రష్యా పౌరులను ఇకపై వీసా ఉంటేనే తమ దేశంలోకి అనుమతించనున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్​ జెలెన్​స్కీ ప్రకటించారు. జులై 1న ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్​ జెలెన్​స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వీసాలు ఉంటేనే రష్యా పౌరులను తమ దేశంలోకి అనుమతించనున్నట్లు ప్రకటించారు. జులై 1న ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఉక్రెయిన్ మీడియా ఈ మేరకు వెల్లడించింది.
రష్యా, ఉక్రెయిన్​ పౌరులు ఎలాంటి వీసాలు లేకుండానే ఇరు దేశాలకు వెళ్లేవారు. అయితే ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర చేపట్టిన తర్వాత పరిస్థితులు మారాయి. ఇరు దేశాల మధ్య నాలుగు నెలలుగా భీకర యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్​పై రష్యా దాడులు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే జెలెన్​స్కీ రష్యా పౌరులకు వీసా విధానాన్ని ప్రకటించారు.

మరోవైపు తమ 27 దేశాల కూటమిలో చేరేలా దరఖాస్తు చేసుకునేందుకు ఉక్రెయిన్​కు అవకాశం ఇవ్వాలని యూరోపియన్ యూనియన్ కార్యనిర్వాహక విభాగం సిఫారసు చేసింది. ఇది ఉక్రెయిన్​కు ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ.. ఈ అధికార ప్రక్రియ పూర్తి కావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఉక్రెయిన్ దరఖాస్తుకు ఈయూ కూటమిలోని అన్ని దేశాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈయూ సిఫారసు విషయం తెలిసినప్పటికీ రష్యా మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్​పై భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది.

ఇదీ చదవండి: 'కిమ్'​ రాజ్యం ఉక్కిరిబిక్కిరి.. కరోనాకు తోడు అంటువ్యాధులతో..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.