'మోదీజీ మీ నాయకత్వం భేష్.. ప్రపంచ వేదికపై మీ వెన్నంటే ఉంటాం'

author img

By

Published : May 22, 2023, 1:04 PM IST

Updated : May 22, 2023, 1:38 PM IST

modi-papua-new-guinea-modi-key-comments-on-developed-countries-in-fipic-summit

పపువా న్యూ గినియా పర్యటనలో ఉన్న ప్రధాని.. అభివృద్ధి చెందిన దేశాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను నమ్మకం ఉంచిన దేశాలు అవసరమైన సమయంలో అండగా ఉండలేదని వ్యాఖ్యానించారు. సోమవారం ఇండియా-పసిఫిక్‌ ఐలాండ్స్‌ కోఆపరేషన్ మూడవ సదస్సులో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, భారత నాయకత్వాన్ని పసిఫిక్ దేశాలు కొనియాడాయి.

ప్రపంచ వేదికపై భారత్ నాయకత్వాన్ని కొనియాడారు పపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మరాపే. భారత్ అందిస్తున్న సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అగ్రదేశాలు అధికారం కోసం ఆడుతున్న ఆటలో తాము బాధితులమయ్యామని జేమ్స్ మరాపే వాపోయారు. సోమవారం జరిగిన ఇండియా-పసిఫిక్‌ ఐలాండ్స్‌ కోఆపరేషన్ మూడవ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్‌ సౌత్‌కు భారత్​ నాయకత్వం వహిస్తోందన్న జేమ్స్ మరాపే.. అంతర్జాతీయ వేదికలపై దాని వెన్నంటే ఉంటామని తెలిపారు. భారత్‌తో కలిసి నడవడం పట్ల ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే తమ మధ్య ఫలవంతమైన ద్వైపాక్షిక చర్చలు జరిగినట్లు ఇరుదేశాల నేతల ప్రకటించారు. దాంతో పాటు తమిళ ప్రఖ్యాత 'తిరుక్కురల్‌' గ్రంథానికి.. గినియా స్థానిక భాషలో చేసిన అనువాదాన్ని ఇద్దరు నేతలు ఆవిష్కరించారు.

అంతకుమందు పపువా న్యూ గినియాకు చేరుకున్న ప్రధానికి అపూర్వ స్వాగతం లభించింది. పపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్‌ మరాపే.. మోదీకి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం వారిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కాగా పపువా న్యూ గినియాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ సదస్సులో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. అభివృద్ధి చెందిన దేశాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను నమ్మకం ఉంచిన దేశాలు అవసరమైన సమయంలో అండగా ఉండలేదని వ్యాఖ్యానించారు.

గ్లోబల్‌ సౌత్​పై కొవిడ్ ప్రభావం తీవ్రంగా పడిందన్న ప్రధాని.. వాతావరణ మార్పులు, ఆకలి, పేదరికం, వైద్యపరమైన సమస్యలు ఉండనే ఉన్నాయన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం ఇంధనం, ఆహారం, ఎరువులు, ఔషధాల సరఫరా వ్యవస్థ దెబ్బతిందని మోదీ తెలిపారు. ఆ ప్రభావాన్ని అందరూ అనుభవిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంకా కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయన్న మోదీ.. ఈ క్లిష్టసమయంలో ​దేశం నమ్మినవారు భారత్ వైపు నిలబడలేదన్నారు. కానీ, భారత్.. పసిఫిక్ ప్రాంత దేశాలకు అండగా నిలవడం పట్ల సంతోషంగా ఉందని మోదీ తెలిపారు. ఎటువంటి సంకోచం లేకుండా పసిఫిక్ దేశాలతో తన అనుభవాలను, సామర్థ్యాన్ని పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. తన దృష్టిలో పసిఫిక్‌ ద్వీప దేశాలు.. మహాసముద్రం పరిధిలోని పెద్ద దేశాలని, చిన్నద్వీపదేశాలు ఏమాత్రం కాదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

మోదీకి మూడు దేశాల అవార్డులు..
పపువా న్యూ గినియా ప్రభుత్వం మోదీని "కంపెనియన్​ ఆఫ్​ ద ఆర్డర్​ ఆఫ్​ లొగొహు" అవార్డ్​తో సత్కరించింది. పసిఫిక్ ద్వీప దేశాల ఐక్యతకు, గ్లోబల్ సౌత్​కు నాయకత్వం వహించినందుకు మోదీకి ఈ అవార్డ్​ అందజేసినట్లు గినియా ప్రభుత్వం ప్రకటించింది. కాగా చాలా తక్కువ మంది విదేశీయులు పపువా న్యూ గినియా నుంచి ఈ అవార్డ్​ను​ అందుకున్నారు.

modi-papua-new-guinea-modi-key-comments-on-developed-countries-in-fipic-summit
పపువా న్యూ గినియా ప్రభుత్వం నుంచి మోదీకి అవార్డ్​

ఫిజి కూడా ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని నరేంద్ర మోదీకి అందించింది. "కంపెనియన్​ ఆఫ్​ ది అర్డర్​ ఆఫ్​ ఫిజి" అవార్డ్​తో భారత ప్రధాన మంత్రిని ఆ దేశం సత్కరించింది. ఈ అవార్డ్​ను ఫిజియేతరులకు ఇవ్వటం చాలా అరుదు. మోదీ ప్రపంచ నాయకత్వానికి గుర్తుగా దీన్ని అందించినట్లు ఫిజి ప్రకటించింది.
పలావ్ ప్రభుత్వం నుంచి సైతం.. ఎబకల్ అవార్డు అవార్డ్​ను అందుకున్నారు మోదీ. అధ్యక్షుడు సురాంగెల్ ఎస్​. విప్స్.. మోదీకి ఈ అవార్డ్​ను అందజేశారు.

modi-papua-new-guinea-modi-key-comments-on-developed-countries-in-fipic-summit
పలావ్ ప్రభుత్వం నుంచి మోదీకి అవార్డ్​
modi-papua-new-guinea-modi-key-comments-on-developed-countries-in-fipic-summit
ఫిజి నుంచి ఆ దేశ అత్యున్నత పురస్కారం అందుకుంటున్న మోదీ
Last Updated :May 22, 2023, 1:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.