'వారం రోజుల్లో 40 లక్షల కొత్త కేసులు'

author img

By

Published : Aug 4, 2021, 7:59 PM IST

World wide corona cases

గత వారం రోజుల్లో కొత్తగా 40 లక్షల మందికి కరోనా వైరస్(Corona Virus)​ సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియా, ఆసియా దేశాల్లో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉన్నట్లు హెచ్చరించింది. వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్(Delta Variant)​.. 130 దేశాలకు పాకినట్లు తెలిపింది. మరోవైపు, పేద దేశాలకు టీకా(Covid-19 vaccine) అందించేందుకు బూస్టర్​ డోస్​పై(Booster dose) మారటోరియం విధించాలని కోరారు టెడ్రోస్​ అధనోమ్​.

కరోనా మహమ్మారి(Corona Virus)​ మరోమారు పంజా విసురుతోందని ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ). గత వారంలో ఏకంగా 40 లక్షల కొత్త కేసులు నమోదైనట్లు తెలిపింది. ముఖ్యంగా పశ్చిమాసియా, ఆసియా దేశాల్లో విజృంభణే ఇందుకు కారణంగా పేర్కొంది. గత నెల రోజుల నుంచి కరోనా వ్యాప్తి పెరుగుతోందని, అయితే.. ప్రపంచవ్యాప్తంగా మరణాలు 8 శాతం తగ్గటం ఊరట కలిగించే విషయమని తెలిపింది.

కరోనా కేసులు, మరణాలపై వార నివేదికను బుధవారం విడుదల చేసింది డబ్ల్యూహెచ్​ఓ.

"పశ్చిమాసియా, ఆసియాలో మరణాల సంఖ్య మూడింతలు పెరిగింది. గత వారంలో అమెరికా, భారత్​, ఇండోనేసియా, బ్రెజిల్​, ఇరాన్​ దేశాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. 130కిపైగా దేశాల్లో డెల్టా వేరియంట్​ (Delta Variant)​కేసులు వెలుగు చూశాయి. మరోవైపు.. ఐరోపాలో కొత్త కేసులు 9 శాతం తగ్గాయి. దీంతో బ్రిటన్​, స్పెయిన్​పై వైరస్​ ప్రభావం కాస్త తగ్గింది."

-ప్రపంచ ఆరోగ్య సంస్థ

కరోనా వైరస్​ వ్యాప్తి తగ్గుతున్న క్రమంలో యూకేలో కొవిడ్​-19 ఆంక్షలను పూర్తిస్థాయిలో తొలగించినట్లు డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. సుమారు 60 శాతం మంది బ్రిటీష్​ ప్రజలకు పూర్తిస్థాయిలో కొవిడ్​ వ్యాక్సిన్​(Covid-19 vaccine) అందినట్లు పేర్కొంది.

బూస్టర్​ డోస్​పై మారటోరియం..

కొవిడ్​ టీకా(Corona vaccine) అతి తక్కువ మందికి అందిన దేశాల్లో కనీసం ఒక్కడోసైనా అందుబాటులో ఉంచేందుకు బూస్టర్​ డోస్​పై(Booster dose) మారటోరియం విధించాలని కోరారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్​ జనరల్​ టెడ్రోస్​ అధనోమ్​ గెబ్రెయెసస్​. కొవిడ్​ వ్యాక్సిన్​ అందుబాటులో ఉన్న ధనిక దేశాలు.. పేద దేశాలకు డోసులను అందించేందుకు ముందుకు రావాలని కోరారు. 'ప్రతి దేశంలో కనీసం 10 శాతం మందికైనా టీకా అందేందుకు.. వచ్చే సెప్టెంబర్​ చివరి వరకైనా బూస్టర్​ డోస్​పై మారటోరియం విధించాలని డబ్ల్యూహెచ్​ఓ కోరుతోంది' అని పేర్కొన్నారు.

మరోవైపు.. బూస్టర్​ డోస్​ కొవిడ్​-19పై మరింత సమర్థవంతంగా పనిచేస్తుందన్న విషయాన్ని సైన్స్​ నిరూపించలేదని గుర్తు చేశారు డబ్ల్యూహెచ్​ఓ అధికారులు.

ఇదీ చూడండి: వైరస్​లపై ఆయుధాలను పొదుపుగా వాడాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.