చైనాలో మరో 18 ప్రమాదకర వైరస్​లు!

author img

By

Published : Nov 16, 2021, 11:21 PM IST

scientists

మహమ్మారి వ్యాప్తితో ప్రపంచమంతా సతమతం అవుతున్న నేపథ్యంలో చైనాలో మరో 18 రకాల ప్రమాదర వైరస్​లను గుర్తించారు శాస్త్రవేత్తలు. 16 రకాల వివిధ జంతుజాతులకు చెందిన 1725 వన్య ప్రాణులపై శాస్త్రవేత్తలు ఈ పరీక్షలు నిర్వహించారు.

కరోనా మహమ్మారి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో మరోసారి వైరస్​ల కలకలం మొదలైంది. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 71 రకాల వైరస్​లను గుర్తించారు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు. వీటిలో 18 ప్రమాదకరమైన వైరస్​లను గుర్తించారు. చైనాలోని జంతుమాంసం మార్కెట్లే లక్ష్యంగా చైనా, అమెరికా, బెల్జియం, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరీక్షలు నిర్వహించారు. 16 రకాల వివిధ జాతులకు చెందిన 1725 వన్య ప్రాణులపై ఈ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు.

చైనా ప్రభుత్వం విక్రయానికి నిషేధించిన పలు జంతువులపైన కూడా శాస్త్రవేత్తలు జరిపారు.

"ఈ పరీక్షల ద్వారా 71 రకాల వైరస్​లను గుర్తించాము. అందులో 45 వైరస్​లను కొత్తగా కనుగొన్నాము. వీటిలో 18 రకాల వైరస్​లు మనుషులకు, జంతువులకు కూడా చాలా ప్రమాదకరమైనవి. వైరస్​ల వ్యాప్తిలో వన్యప్రాణులే కీలక పాత్ర పోషిస్తాయి అనడానికి ఈ వివరాలే ఉదాహరణ"

-శాస్త్రవేత్తలు

ఆ జంతువులోనే ఎక్కువ వైరస్​లు..

అత్యధికంగా సివెట్స్​ అనే జంతువుల్లో ప్రమాదకర వైరస్​లను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. గబ్బిలా నుంచి వచ్చే హెచ్​కేయూ8 రకం కరోనా వైరస్​ ఓ సివెట్​కు వ్యాప్తించినట్లు గుర్తించామన్నారు. ఇంకా పలు జంతువుల్లో కూడా ఈ వ్యాప్తి ఉందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : 'సంపద'లో అమెరికాను దాటేసిన చైనా- షాకింగ్ లెక్కలివే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.