భారత్​, పాక్​ మధ్య 'బాస్మతి' రగడ

author img

By

Published : Jun 7, 2021, 3:15 PM IST

India, Pakistan row over basmati rice

భారత్​పై మరోసారి అక్కసు వెళ్లగక్కింది పాకిస్థాన్. బాస్మతి బియ్యంపై ప్రత్యేక ట్రేడ్​మార్క్ హక్కుల కోసం ఐరోపా సమాఖ్యకు భారత్​ దరఖాస్తు చేసుకున్న వేళ గగ్గోలు పెడుతోంది.

బాస్మతి బియ్యంపై ప్రత్యేక ట్రేడ్‌మార్క్‌ హక్కుల కోసం ఐరోపా సమాఖ్యకు దరఖాస్తు చేసింది భారత్‌. ఈ మేరకు రక్షణాత్మక భౌగోళిక గుర్తింపు కోసం విజ్ఞప్తి చేసింది. అయితే భారత్‌ దరఖాస్తుపై పాకిస్థాన్ గగ్గోలు పెడుతోంది.

ప్రపంచంలోనే అత్యధికంగా బియ్యం ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉండగా, పాకిస్థాన్ నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచ దేశాలకు భారత్‌, పాకిస్థాన్ మాత్రమే బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నాయి. అయితే ఐరోపా క్రిమిసంహారక ప్రమాణాల విషయంలో భారత్‌ ఇబ్బందులను అందిపుచ్చుకున్న పాకిస్థాన్.. గత మూడు సంవత్సరాల్లో ఐరోపా సమాఖ్య దేశాలకు బియ్యం ఎగుమతులను విస్తరించింది.

ఐరోపా సమాఖ్యకు ఏటా 3లక్షల టన్నుల బాస్మతి బియ్యం డిమాండ్‌ ఉండగా, మూడింట రెండు వంతులు పాకిస్థాన్ తీరుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ డిమాండ్‌పై పాకిస్థాన్ గగ్గోలు పెడుతోంది. భారత్‌ నిర్ణయం తమపై అణు బాంబు వేయడమే అని పలువురు పాకిస్థాన్ బాస్మతి బియ్యం మిల్లుల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌కు ట్రేడ్‌మార్క్ హక్కులు వస్తే తమ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: 'భారత్​తో ఎలాంటి వాణిజ్యం వద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.