ETV Bharat / international

చైనా బరి తెగింపు- గాల్వన్​ లోయ తమదేనని ప్రకటన

author img

By

Published : Jun 17, 2020, 2:46 PM IST

Updated : Jun 17, 2020, 3:02 PM IST

తూర్పు లద్దాఖ్​లోని గాల్వన్​ వ్యాలీ తమ భూభాగమేమని ప్రకటించింది చైనా. ఆ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య ఘర్షణలు అయి, భారీ ప్రాణనష్టం జరిగిన మరునాడు ఈ విషయంపై స్పందించింది. భారత బలగాలే తమ భూభాగంలోని చొచ్చుకొచ్చాయని బుకాయించింది. ఈ ఘటనలో ఎంత మంది చైనా సైనికులు మరణించారనే విషయంపై మాత్రం స్పందించలేదు.

China claims sovereignty over Galwan Valley; refuses to comment on Chinese casualties
చైనా బరితెగింపు..గాల్వన్​ లోయ తమదేనని ప్రకటన

చైనా మరింత బరి తెగించింది. గాల్వన్ వ్యాలీ భూభాగంపై సార్వభౌమాధికారం తమదేనని ప్రకటించింది. భారత సైన్యం తమ భూభాగంలోకి చొచ్చుకొస్తోందని బుకాయించింది. తమ సైన్యాన్ని అదుపులో పెట్టుకోవాలని భారత్​ను కోరుతున్నామంది. సరిహద్దుపై వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని పేర్కొంది. చైనా భూభాగంలోనే ఘర్షణ జరిగిందని.. ఇందుకు తమను బాధ్యులను చేయొద్దని వ్యాఖ్యానించింది. సమస్యను పరిష్కరించేందుకు దౌత్య, సైన్యాధికారుల స్థాయిలో భారత్​తో మాట్లాడుతున్నట్లు చెప్పింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ ప్రకటన విడుదల చేశారు.

ఇక చాలు...

సరిహద్దులో మరోసారి ఘర్షణలు జరగాలని తాము కోరుకోవడం లేదని తెలిపారు లియాజన్​. నాయకుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని రెండు దేశాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు యథావిధిగా కొనసాగేలా చూడాలన్నారు.

ఎంతమంది చనిపోయారో చెప్పం..

సోమవారం రాత్రి గాల్వన్​ లోయలో ఇరు దేశాల బలగాల మధ్య జరిగిన ఘర్షణలో ఎంతమంది చైనా సైనికులు మరణించారనే విషయంపై స్పందిందేందుకు నిరాకరించారు జావో లిజాయాన్​. ఆ విషయంపై తానేమీ మాట్లడలేనని అన్నారు. చైనా-భారత్​ సరిహద్దులో పరిస్థితులపై ఇరు దేశాల అధికారులు చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు.

గాల్వన్​ లోయలో ఇరు దేశాల బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 20మంది జవాన్లు అమరులైనట్లు భారత్​ ప్రకటించింది. 43 మంది చైనా సైనికులు మరణించి ఉంటారని అంచనా వేసింది. ఆ దేశ ప్రభుత్వం మాత్రం తమ సైనికులు ఎంతమంచి చనిపోయారని విషయాన్ని వెల్లడించలేదు. అయితే 35 మంది చైనా సైనికులు మృతి చెందినట్లు అమెరికా నిఘా‌ వర్గాలు భావిస్తున్నట్లు ఫ్రీ ప్రెస్ ‌జర్నల్‌ తన కథనంలో పేర్కొంది.

ఇదీ చూడండి: 'జవాన్ల త్యాగాలను దేశం మరవదు'

Last Updated : Jun 17, 2020, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.