'తక్షణమే మీ సాయం అవసరం'.. అమెరికా కాంగ్రెస్​కు జెలెన్​స్కీ వినతి

author img

By

Published : Mar 16, 2022, 7:41 PM IST

Zelenskyy tells US Congress

Zelenskyy us congress: రష్యాపై పోరాటంలో తక్షణం అమెరికా సాయం అవసరమని విజ్ఞప్తి చేశారు ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ. అమెరికా కాంగ్రెస్​లో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు. రష్యా చట్టసభ్యులపై మరిన్ని ఆంక్షలు విధించాలని, దిగుమతులను ఆపేయాలని కోరారు.

Zelenskyy us congress: ఉక్రెయిన్​పై రష్యా సేనలు గత 20 రోజులుగా క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతున్నాయి. ఈ తరుణంలో తమకు తక్షణం అమెరికా సాయం అవసరమని కోరారు ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ. అమెరికా కాంగ్రెస్​లో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడిన జెలెన్​స్కీ.. ముత్యాల నౌకాశ్రయం(పెర్ల్​ హర్బర్​), 9/11 ఉగ్రదాడిని ప్రస్తావించారు. రష్యాపై పోరాటంలో ఉక్రెయిన్​కు సాయం చేసేందుకు అమెరికా కాంగ్రెస్​ మరిన్ని చర్యలు తీసుకోవాలని విన్నవించారు. తమ దేశ గగనతలాన్ని మూసివేయాలన్న వాదన(నో ఫ్లై జోన్​) నెరవేరకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

క్యాపిటోల్​ కాంప్లెక్స్​లో లైవ్​స్ట్రీమింగ్​లో మాట్లాడిన జెలెన్​స్కీ.. రష్యన్​ చట్టసభ్యులపై ఆంక్షలు విధించాలని, దిగుమతులను నిలిపేయాలని కోరారు. తమ దేశంపై యుద్ధంతో ఎదుర్కొంటున్న విధ్వంసానికి సంబంధించిన వీడియోలను చూపించారు.

"తక్షణం మీ సాయం అవసరం. మరిన్ని చర్యలు చేపట్టాలని మిమ్మల్ని కోరుతున్నా. ఆదాయం కన్నా శాంతి చాలా ముఖ్యమైన అంశం. మరణాలను ఆపలేకపోతే నా జీవితానికి అర్థం లేదు."

- వొలొదిమిర్​ జెలెన్​స్కీ, ఉక్రెయిన్​ అధ్యక్షుడు.

జెలెన్​స్కీ ప్రసంగం ప్రారంభం, ముగింపు సందర్భంగా స్టాడింగ్​ ఒవెషన్​ ఇచ్చారు కాంగ్రెస్​ సభ్యులు. ఆయన పోరాట పటిమను కొనియాడారు.

ఇదీ చూడండి: రసాయన దాడుల ముప్పు.. ఉక్రెయిన్​ ప్రజల్లో గుబులు!

బాంబు దాడిలో ఇద్దరు ఫాక్స్ న్యూస్​ జర్నలిస్టులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.