అక్కడ నిద్రపోయినా పనిచేసినట్టే.. జీతం ఎంతంటే?

author img

By

Published : Oct 8, 2021, 7:12 PM IST

Updated : Oct 10, 2021, 7:34 PM IST

cats in work

నిద్రపోతే పనిచేసినట్టు ఏంటని ఆలోచిస్తున్నారా? దానికి జీతం కూడా ఇస్తారా అని ఆశ్యర్యపోతున్నారా? అది ఎక్కడో తెలుసుకోవాలని ఉందా? అయితే ఆ అరుదైన అవకాశం ఎవరికి? అది ఎక్కడో? తెలియాలంటే ఇది చదివేయాల్సిందే..

అక్కడ నిద్రపోయినా పనిచేసినట్టే.. జీతం ఎంతంటే?

అమెరికాలోని షికాగోలో ఉద్యోగాలు పెరిగిపోయాయి. అయితే మనుషులకు కాదు. పిల్లులకు మాత్రమే. పిల్లులకు ఉద్యోగాలు ఏంటి? అది కూడా వాటికి వేతనం ఇవ్వడం ఏంటని అనుకుంటున్నారా? ఇది నిజమే. పని ప్రదేశాలు, గల్లీల్లో ఎలుకలను నివారించేందుకు షికాగోలో అడవి పిల్లులను విరివిగా నియమించుకుంటున్నారు.

ఎక్కడా ఆవాసం లేని పిల్లులకు 'క్యాట్స్​ ఎట్ వర్క్​' అనే కార్యక్రమం ద్వారా జీవితాంతం ఆహారం, నివాసం కల్పించే ప్రయత్నం చేస్తోంది ట్రీ హౌస్ హ్యూమన్ సొసైటీ. దీని ద్వారా వాటికి ఆశ్రయం కల్పించడం సహా ఎలుకల బాధ తప్పించుకోవాలని అనుకుంటున్న నివాసితులు, వ్యాపారులకు పరిష్కారాన్ని చూపుతోంది.

cats in work
ఎలుక కోసం మాటువేసిన పిల్లి

ఆ రసాయనాలంటే ఎలుకలకు భయం..

ఈ పిల్లులను తీసుకున్న ఇంటి యజమానులు, వ్యాపారులు.. వాటిని పోషిస్తూ ఎలుకల బెడదను తప్పించుకుంటున్నారు. ఈ 'క్యాట్స్​ ఎట్ వర్క్'లో భాగంగా పిల్లులు నిద్రపోతున్నా.. పనిచేస్తున్నట్లే లెక్క. ఎందుకంటే నిద్రలో ఉన్నా, మెలకువతో ఉన్నా పిల్లుల నుంచి ఫెరోమోన్లు అనే రసాయనాలు విడుదలవుతుంటాయి. ఇతర పిల్లులతో సమాచార మార్పిడి కోసం ఆ రసాయనాలు సహజంగా విడుదలవుతుంటాయి. అయితే ఎలుకలు వాటిని పసిగట్టి.. అక్కడికి నుంచి పారిపోతుంటాయి..

cats in work
ఎలుకల వేటల పనిలో పిల్లి

"ఎలుకలను నివారించేలా పిల్లుల నుంచి విడుదలయ్యే ఫెరోమోన్లు పనిచేస్తాయి. పిల్లులు ఎక్కడ ఉంటే.. అక్కడ ఉండకూడదని ఎలుకలకు అర్థమైపోతుంది."

- సారా లిస్, ట్రీ హౌస్ హ్యూమన్ సొసైటీ

2012 నుంచి వెయ్యికి పైగా పిల్లులను ఈ కార్యక్రమంలో భాగం చేశారు. ట్రీ హౌస్ హ్యూమన్ సొసైటీకి చెందిన వారు అడవి పిల్లులను పట్టుకున్న తర్వాత సాదు జంతువులాగా మార్చి.. వాటిని తెచ్చిన చోటే వదులుతారు. అక్కడ అవి సురక్షితంగా బతకలేవని తెలిస్తే.. వాటిని పెంచుకోవాలని అనుకునేవారికి ఇచ్చేస్తారు.

cats in work
ఎలుకల వేటలో పిల్లి

ఉచ్చులో అన్నిసార్లూ పడకపోవచ్చు..

ఎలుకల మందు, మౌస్​ట్రాప్​ల ఉచ్చులో ఎలుకలు అన్నిసార్లూ పడకపోవచ్చు. అయితే ఎలుకలతో పిల్లులకు ఉండే సహజసిద్ధ వైరం తన వ్యాపారానికి బాగా పనికొచ్చిందని ఎంపైరికల్ బ్రూవరీకి చెందిన విలియం హర్లే తెలిపారు. ఎందుకంటే మందు, ఇతర తినుబండారాల కోసం వాడే ధాన్యాలకు ఎలుకలు ఆకర్షితమవుతాయి. గోదాముల్లోని ధాన్యాల బస్తాల చాటున దాక్కొని నష్టం కలిగిస్తాయి. పైగా ఎలుకలను చంపడం ఇష్టం లేక.. కేవలం పిల్లులను పెంచడం ద్వారా వాటి సమస్యకు పరిష్కారం లభించినట్లు హర్లే వివరించారు.

cats in work
షికాగాలో పిల్లులు

"రసాయనాలు, ట్రాప్​ చేయడం ద్వారా ఎలుకలను చంపాలని నేను అనుకోవడం లేదు. బదులుగా సహజంగా వేటికైతే అవి భయపడి దూరంగా ఉంటాయో, వాటినే ఉపయోగించి ఎలుకల జనాభాను అదుపు చేయాలని భావించా."

- విలియం హర్లే, వ్యాపారి

పనిచేసే చోటే పిల్లులు జీవితాంతం బతకగలిగితే చాలని ట్రీ హౌస్ హ్యూమన్ సొసైటీ భావిస్తోంది. ఆ లక్ష్యం దిశగానే తాము ముందుకు సాగుతున్నట్లు సారా తెలిపారు.

"పిల్లులు జీవితాంతం పనిచేసే చోటే ఉండాలని మేము కోరుకుంటున్నాం. దత్తత తీసుకున్న పిల్లులను 18 నుంచి 20 ఏళ్ల పాటు ఎలా చూసుకుంటారో.. వీటిని కూడా అలాగే అవి జీవించి ఉన్నంతకాలం చూసుకోవాలని భావిస్తున్నాం. అదే సంరక్షకుని నీడలో అవి కడవరకు బతకాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం."

- సారా లిస్, ట్రీ హౌస్ హ్యూమన్ సొసైటీ

ఇవీ చూడండి:

కొవిడ్​ సోకిందని పిల్లులను చంపిన అధికారులు!

పాస్​వర్డ్ కొట్టి ఇంట్లోకి వస్తున్న పిల్లి.. ఎక్కడంటే?

పిల్లుల్లో కరోనా యాంటీబాడీలు- సర్వేలో షాకింగ్​ నిజాలు

WONDER: పిల్లి పిల్లలకు పాలిస్తున్న శునకం.. ఆశ్చర్యపోతున్న ప్రజలు..!

ఇది కుక్క కాదు.. నిజంగా పిల్లేనండి.. చూడండి!

Last Updated :Oct 10, 2021, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.