మనిషికి పంది కిడ్నీ అమర్చిన వైద్యులు- ఆపరేషన్ సక్సెస్!

author img

By

Published : Oct 20, 2021, 4:32 PM IST

PIG KIDNEY

వైద్య రంగంలో మరో అద్భుతం జరిగింది. అవయవ మార్పిడిలో సరికొత్త అధ్యాయానికి ముందడుగు పడింది. అమెరికాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఇటీవల పంది మూత్రపిండాన్ని మానవ శరీరానికి (Pig Kidney Transplant) తాత్కాలికంగా అమర్చారు. ఈ ఆపరేషన్‌ (Pig Kidney Transplant) విజయవంతమైందని, మనిషి శరీరంలో పంది కిడ్నీ సాధారణంగానే పనిచేసిందని శాస్త్రవేత్తలు తెలిపారు. (Pig Kidney to Human)

ప్రస్తుత పరిస్థితుల్లో మానవుల్లో అవయవమార్పిడి సర్వ సాధారణమే అయినప్పటికీ అవయవాల కొరత వేధిస్తోంది. ఇందుకు పరిష్కారం కనుగొనే దిశగా శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు. జంతువుల అవయవాలను మనషులకు అమర్చే అంశంపై పరిశోధనలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ లాంగోన్‌ హెల్త్‌ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగం చేశారు. బ్రెయిన్‌ డెడ్‌ అయిన రోగికి పంది కిడ్నీ (Pig Kidney to Human) అమర్చాలని నిర్ణయించారు. ఇందుకు ఆ రోగి బంధువులు కూడా అంగీకరించగా.. గత నెల ఆపరేషన్‌ (Pig Kidney Transplant) నిర్వహించారు.

పంది కిడ్నీని రోగి శరీరానికి (Pig Kidney to Human) అమర్చి మూడు రోజల పాటు పరిశీలించారు. ఈ కిడ్నీ సాధారణంగానే పనిచేసిందని, రోగనిరోధక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేదని సర్జన్‌ డా. రాబర్డ్‌ మోంట్గోమెరి తెలిపారు.

జన్యు సవరణ చేసి..

అవయవాల కొరతకు పరిష్కారం కనుగొనే క్రమంలో గత కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు పందుల అవయవాలపై (Pig Kidney Human Transplant) దృష్టి పెట్టారు. దీంట్లో కొన్ని సమస్యలున్నాయి. పంది కణాల్లోని గ్లూకోజ్‌ మనిషి శరీర వ్యవస్థకు సరిపోలడం లేదు. ఇది రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసి తిరస్కరణకు గురవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చేసిన ప్రయోగంలో జన్యు సవరణ చేసిన పంది నుంచి అవయవాన్ని (Pig Kidney to Human) సేకరించారు. పంది కణాల్లో చక్కెర స్థాయిలను తొలగించి, రోగ నిరోధక వ్యవస్థ దాడిని నివారించేలా జన్యువుల్లో మార్పులు చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైందని, అవయవ మార్పిడిలో ఇది కీలకమైన ముందడుగని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అవయవాల కొరత..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అవయవాల కొరత ఉంది. ఒక్క అమెరికాలోనే లక్ష మందికి పైగా అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తుండగా.. వీరిలో 90వేల మందికి పైగా కిడ్నీ సమస్య బాధితులే. అమెరికా నెట్‌వర్క్ ఫర్‌ ఆర్గాన్‌ షేరింగ్‌ ప్రకారం.. ఒక మనిషికి కిడ్నీ దొరకేందుకు సగటున మూడు నుంచి ఐదేళ్లు పడుతోంది.

దీంతో శాస్త్రవేత్తలు జంతువుల నుంచి అవయవాలను సేకరించి మనుషులకు అమర్చే అంశంపై విస్తృతంగా ప్రయోగాలు జరుపుతున్నారు. నిజానికి జంతువుల అవయవాలను మనుషులకు అమర్చే అంశంపై 17వ శతాబ్దం నుంచే ప్రయోగాలు జరుగుతున్నాయి. 20వ శతాబ్దంలో కొందరు శాస్త్రవేత్తలు ఒకరకమైన కొండముచ్చు... బబూన్‌ గుండెను ఓ చిన్నారికి అమర్చి 21 రోజుల పాటు జీవించేలా చేశారు. ఇలాంటి ప్రయోగాలు విజయవంతమైతే.. అవయవాలు దొరికే వరకు తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు జంతువుల అవయవాలను అమర్చి మనుషుల ప్రాణాలు బతికించొచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: మూత్రంలో ప్రోటీన్ పోతుందా?.. అయితే ఇదే కారణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.