కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారత విద్యార్థులు మృతి

author img

By

Published : Mar 14, 2022, 7:34 AM IST

Road accident in Canada

Road accident in Canada: కెనడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

Road accident in Canada: కెనడాలోని ఒంటారియో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పాసింజర్‌ వ్యాన్‌.. ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న ఐదుగురు భారతీయ విద్యార్థులు మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

మృతులను హర్‌ప్రీత్‌ సింగ్‌, జస్పీందర్‌ సింగ్‌, కరణ్‌పాల్‌ సింగ్, మోహిత్‌ చౌహాన్‌, పవన్‌కుమార్‌గా అక్కడి పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు కెనడాలోని భారత రాయబారి అజయ్‌ బిసారియా తెలిపారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ట్విటర్‌లో ఆయన పేర్కొన్నారు. బాధితుల స్నేహితులను సంప్రదించి.. సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: పట్టపగలే యువతిపై అఘాయిత్యం.. నడిరోడ్డుపైనే అలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.