ETV Bharat / international

జింక్​, సి విటమిన్​తో ఊరట అంతంతే!

కొవిడ్​ లక్షణాల నుంచి ఉపశమనం కలిగించడంలో జింక్​ లేదా సీ విటమిన్లు పోషించే పాత్రపై పరిశోధకులు కీలక విషయాలు వెల్లడించారు. అమెరికాలోని క్లీవ్​లాండ్​ క్లినిక్​ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వీటి ప్రభావం అంతంత మాత్రమేనని తేలింది.

author img

By

Published : Feb 17, 2021, 7:40 AM IST

zinc, vitamin c, research
జింక్​, సి విటమిన్​తో ఊరట అంతంతే!

జింక్​ లేదా సి విటమిన్​ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల కొవిడ్​ బాధితుల్లో వ్యాధి లక్షణాల తీవ్రత లేదా సమయం పెద్దగా తగ్గవని ఆమెరికాలోని క్లీవ్​లాండ్ క్లినిక్ శాస్త్రవేత్తల తాజా పరిశోధన పేర్కొంది. సాధారణంగా.. రోగనిరోధక వ్యవస్థ పనితీరులో జింక్​కు ముఖ్యమైన పాత్ర ఉంది. యాంటీబాడీ, తెల్లరక్త కణ ఉత్పత్తిలో, ఇన్​ఫెక్షన్లపై పోరాటంలో అది సాయ పడుతుంది. యాంటీఆక్సిడెంట్​ అయిన సి విటమిన్.. కణాలకు జరిగే నష్టాన్ని తగ్గించడంలో తోడ్పాటు అందిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

గతేడాది కొవిడ్ విజృంభణ తీవ్రమై, పెద్దసంఖ్యలో బాధితులు మృత్యువాత పడుతున్న తరుణంలో.. జింక్​, విటమిన్ సప్లిమెంట్లతో ప్రయోజనం ఉంటుందన్న ఉద్దేశంతో ప్రజలు వీటికోసం ఎగబడ్డారని పరిశోధనకు నేతృత్వం వహించిన మిలింద్​ దేశాయ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ -19 ఇన్​ఫెక్షన్​ను తగ్గించడంలో ఈ రెండింటి పాత్ర గురించి పరిశోధన చేపట్టామని తెలిపారు. 214 మంది రోగులపై ఈ అధ్యయనం సాగింది. వీరిలో కొందరికి 10 రోజుల పాటు జింక్​ గ్లూకోనేట్​ (50 ఎంజీ) లేదా విటమిన్​ సి (8000 ఎంజీ) ఇచ్చారు. కొందరికి రెండు రకాల మందులనూ అందించారు. మిగతావారికి ప్రామాణిక సంరక్షణ విధానాన్ని అందించారు. వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం విషయంలో ఈ బృందాల మధ్య పెద్దగా వైరుధ్యం లేదని తేల్చారు.

ఇదీ చదవండి : ప్రకృతి శాపం.. మనిషిదీ పాపం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.