ట్రక్కును ఢీకొన్న కారు.. ఆరుగురు విద్యార్థులు మృతి

author img

By

Published : Mar 24, 2022, 4:51 AM IST

6 students killed in Oklahoma crash

6 students killed in Oklahoma crash: అమెరికా ఒక్లహోమాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కును ఢీకొట్టడం వల్ల ఆరుగురు టీనేజ్ స్టూడెంట్స్ మృతిచెందారు.

6 students killed in Oklahoma crash: అమెరికా ఒక్లహోమా నగరంలో విషాదం జరిగింది. రోడ్డుప్రమాదంలో ఆరుగురు టీనేజ్ విద్యార్థులు మృతిచెందారు. వీరంతా నాలుగు సీట్లున్న కారులో ఇరుకుగా వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు ఒక్లహోమా హైవే పాట్రోలింగ్ అధికారులు తెలిపారు.

ప్రమాద సమయంలో ఒక్కరే సీటు బెల్టు పెట్టుకున్నారని అన్నారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు.. ఓ ట్రక్కును ఢీ కొట్టడం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

ఈ ఘటనపై టిషోమింగో పబ్లిక్ స్కూల్ సూపరింటెండ్ ఫేస్​బుక్​లో పోస్ట్ పెట్టారు. తమ పాఠశాలకు ఇది అతిపెద్ద నష్టం అని పోస్ట్ చేశారు.

ఇదీ చూడండి: ఉక్రెయిన్​పై రష్యా భీకర దాడులు.. ఐరోపాకు బైడెన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.