వందే భారత్ 2.0!.. త్వరలోనే స్లీపర్, మెట్రో రైళ్లు.. వీటి స్పెషలేంటో తెలుసా?
Updated: May 22, 2023, 8:10 PM |
Published: May 22, 2023, 7:52 PM
Published: May 22, 2023, 7:52 PM
Follow Us 

దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ఈ వందే భారత్ ట్రైన్స్‌లో కేవలం చైర్‌కార్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే వీటికి పెరుగుతున్న ఆదరణకు అనుగుణంగా వందే మెట్రో, వందే స్లీపర్ రైళ్లను త్వరలోనే అందుబాటులోకి తేనుంది రైల్వేశాఖ! అవి కూడా వచ్చే ఏడాది జనవరి- మార్చి నెలల్లో పట్టాలెక్కనున్నట్లు సమాచారం.

1/ 14
భారత ప్రభుత్వం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్యను క్రమంగా పెంచుతోంది. ఇతర రైళ్లతో పోలిస్తే.. ఈ సెమీ హై స్పీడ్ రైలులో తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకోవచ్చు. సౌకర్యాలు కూడా బాగుంటాయి! మెట్రో రైళ్లకు ఉన్నట్టే ఆటోమేటిక్ వ్యవస్థ ఉంటుంది. అయితే ప్రారంభించిన తక్కువకాలంలోనే ప్రజాదరణ పొందిన ఈ రైళ్లల్లో ఒకే ఒక్క కొరత వెంటాడుతోంది. అది స్లీపర్ సౌకర్యం లేకపోవడం. ఇప్పుడా కొరత తీర్చేందుకు రంగం సిద్ధమౌతోంది. వచ్చే ఏడాది కల్లా వందే మెట్రో, వందే స్లీపర్ రైళ్లను అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. 2024 జనవరి నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశమున్న వందే మెట్రో.. 100 కి.మీ ప్రయాణించనుందని సమాచారం. వందే స్లీపర్ 500 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించనుందట. ఈ రెండు కొత్త మోడళ్లు ప్రస్తుతం డిజైన్ దశలో ఉన్నాయట. భారతదేశంలోని ప్రతి రాష్ట్రాన్ని కలుపుతూ వారానికి కనీసం రెండు కొత్త రైళ్లను ప్రారంభించాలనే లక్ష్యంతో వందే భారత్ రైళ్లను ఉత్పత్తి చేస్తుందట కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే 400 వందే భారత్ రైళ్లు తయరీ పూర్తైందట. దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని వందేభారత్ రైళ్లతో అనుసంధానించడం కేంద్ర ప్రభుత్వ మొదటి లక్ష్యం అని.. జూన్ మధ్య నాటికి ఈ మైలురాయిని సాధించాలని మంత్రిత్వ శాఖ టార్గెట్‌గా పెట్టుకుందని సమాచారం.
Loading...
Loading...
Loading...