Amrabad Tiger Reserve అమ్రాబాద్ అడవికి రాణి ఫర్హా
Published on: Jan 21, 2023, 9:41 AM IST |
Updated on: Jan 21, 2023, 9:41 AM IST
Updated on: Jan 21, 2023, 9:41 AM IST

Amrabad Tiger Reserve రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో పులుల సంతతి గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలో అతి పెద్ద టైగర్ రిజర్వు అమ్రాబాద్. ఇక్కడ ప్రస్తుతం 26 పులులు ఉన్నాయి. 22 అటవీశాఖ ఏర్పాటు చేసిన కెమెరాలకు చిక్కాయి. మరో నాలుగింటిని పాదముద్రల ద్వారా గుర్తించారు. ఈ పులుల చిత్రాలు, వివరాల్ని అటవీశాఖ ‘టైగర్ బుక్ ఆఫ్ అమ్రాబాద్ టైగర్ రిజర్వు’ పేరుతో టేబుల్ బుక్‌ని విడుదల చేసింది. ఆడ పులి ఫర్హా నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ అడవికి రాణిగా అవతరించింది. అమ్రాబాద్ సమీపంలోని ఫర్హాబాద్ వ్యూపాయింట్ ప్రాంతంలో సంచరించే ‘ఫర్హా’ ఆడ పులి గతంలో రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అవి కొల్లాపూర్, లింగాల ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం. ఆ పులి తాజాగా 4 కూనలకు జన్మనిచ్చింది. అటవీ అధికారులు ఎఫ్-6గా వ్యవహరించే ఫర్హా రెండు విడతల్లో ఆరింటికి జన్మనిచ్చింది. నల్లమల్ల అడవుల్లోనే మరో ఆడపులికి 3 పిల్లలు పుట్టాయి. పులి కూనలు పుట్టిన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.
1/ 15
అమ్రాబాద్ టైగర్ రిజర్వు

Loading...