నుమాయిష్‌లో తెలంగాణ కొత్త సెక్రటేరియట్
Updated: Jan 25, 2023, 1:30 PM |
Published: Jan 25, 2023, 1:30 PM
Published: Jan 25, 2023, 1:30 PM

కొత్త ఏడాదిలో భాగ్యనగరవాసులకు కాస్త ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి నుమాయిష్ వచ్చేసింది. న్యూ ఇయర్లో మరో న్యూ స్టైల్లో నుమాయిష్ ప్రారంభమైంది. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్‌గా పేరు గాంచిన నుమాయిష్‌కు ప్రారంభమైన నాటి నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు తరలివస్తున్నారు.
సరికొత్త హంగులతో.. మరిన్ని కొత్త ప్రదర్శనలతో.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రకాల వస్తువులు ఈసారి నుమాయిష్‌లో కొలువుదీరాయి. షాపింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నుమాయిష్ నిలిచింది. అందుకే ఈ ఎగ్జిబిషన్ వచ్చిందంటే చాలు మగువులు నాంపల్లికి పరుగు పెడతారు.
కేవలం హైదరాబాద్ వాసులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి కూడా సందర్శకులు నుమాయిష్‌కు వస్తుంటారు. ఇక్కడి స్టాళ్లలో ఉంటే దుస్తులు, యాక్సెసరీస్, వివిధ రకాల వస్తువులు, ఫుడ్‌ను కొనుగోలు చేస్తుంటారు. గుండు పిన్నీసు దగ్గర్నుంచి ఇంట్లో వాడుకునే కుర్చీలు, పెయింటింగ్‌లు, దుస్తులు, ఆహార పదార్థాల వరకు అన్నీ నుమాయిష్‌లో ప్రత్యేకమే. నాణ్యమైన కశ్మీరీ డ్రై ఫ్రూట్స్, శ్రీనగర్ నుంచి దుప్పట్లు మైసూరు నుంచి హస్తకళలతో సహా అన్ని ఇక్కడ లభిస్తాయి.
ఇక ఈ ఏడాది నుమాయిష్‌లో తెలంగాణ కొత్త సచివాలయం నమూనాను ఓ స్టాల్లో ప్రదర్శనకుచ్చారు. ఈ స్టాల్లో సచివాలయం డిజైన్‌ను అచ్చు గుద్దినట్లుగా చూపించారు. ఈస్టాల్ను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా సందర్శించారు. నుమాయిష్‌కు విద్యార్థులు కూడా వస్తుండటంతో సెక్రటేరియట్ ఎలా ఉంటుంది.. దాని నమూనా ఏంటనే విషయం వాళ్లకి తెలుస్తుందని మంత్రి అన్నారు.

1/ 11
s

Loading...