T Hub has been awarded : దేశంలోనే అత్యుత్తమ ఇంక్యుబేటర్‌గా టీ హబ్‌కి అవార్డు
Published: May 14, 2023, 4:03 PM

T Hub has been awarded as the best technology incubator in the country : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ టీహబ్‌ను భారత సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ దేశంలో అత్యుత్తమ టెక్నాలజీ ఇంక్యుబేటర్‌గా గుర్తించినట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ మేరకు టీహబ్ టీమ్‌కు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. నేషనల్ టెక్నాలజీ అవార్డ్ 2023లో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ అవార్డును టి హబ్ గెలుచుకున్నందుకు మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. టీహబ్‌కు జాతీయ పురస్కారం లభించడం పట్ల పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టీహబ్ సీఈవో ఎం.శ్రీనివాస్‌రావులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అంకురాలకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా టీహబ్ (T-Hub), వీహబ్(V-Hub), డేటా సెంటర్, టీవర్క్స్ వంటి వినూత్న ఇంక్యుబేటర్లను ఏర్పరిచింది. ఇన్నోవేషన్ ఎకోసిస్టంను బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలు తోడ్పాడటంతో పాటు దేశవ్యాప్తంగా పలువురి మన్ననలు అందుకుంటున్నాయి.

