రూ.30 కోట్ల విలువ చేసే ఇంటి కబ్జాకు యత్నం, నిందితుల్లో బిగ్‌బాస్ బ్యూటీ
Swathi Deekshith House Issue in Jublihills : గ్రేటర్ హైదరాబాద్‌లో రోజు రోజుకి కబ్జాల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. నగరంలో భూముల విలువ కోట్లలో ఉండటంతో కొన్ని చోట్ల స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. రూ.కోట్లు విలువ చేసే భూములను.. ఇళ్లను కబ్జాలు చేస్తూ అక్రమార్జనలు చేస్తున్నారు. తాజాగా, ఇలాంటి ఘటన నగరంలోని ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. రూ.30 కోట్ల విలువ చేసే ఓ ఇంటిని ప్రముఖ సినీ నటి స్వాతి దీక్షిత్ కబ్జాకు యత్నించినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

1/ 6
Swathi Deekshith House Issue in Jublihills : గ్రేటర్ హైదరాబాద్‌లో రోజు రోజుకి కబ్జాల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. నగరంలో భూముల విలువ కోట్లలో ఉండటంతో కొన్ని చోట్ల స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. రూ.కోట్లు విలువ చేసే భూములను.. ఇళ్లను కబ్జాలు చేస్తూ అక్రమార్జనలు చేస్తున్నారు. తాజాగా, ఇలాంటి ఘటన నగరంలోని ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. రూ.30 కోట్ల విలువ చేసే ఓ ఇంటిని ప్రముఖ సినీ నటి స్వాతి దీక్షిత్ కబ్జాకు యత్నించినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆమెతో పాటు 20 మందిపై వివిధ సెక్షన్ల్ కింద కేసు నమోదు చేశామని పోలీసులు వివరించారు. తన యజమాని ఇంటిపై దాడికి దిగి.. ఇంటిలోనికి ప్రవేశించారని ఇంటి వాచ్మెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చింతల శని ప్రశాంత్‌తో పాటు స్వాతి దీక్షిత్ వచ్చారని.. ప్రశాంత్ కారు దిగి పరుష పదజాలంతో దుర్భాషలాడారని.. ఇల్లు ఖాళీ చేయమని బెదిరించారని.. లేకపోతే వారిని చంపేస్తామని హెచ్చరించారని వాచ్మెన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ఏడాది నుంచి ఆ ఇంటి యజమానికి.. స్వాతి దీక్షిత్మధ్య వివాదం కొనసాగుతుందని పోలీసులు స్పష్టంచేశారు. కాగా, ఆ ఇంటి లీజ్ విషయం కోర్టులో కేసు నడుస్తున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.
Loading...
Loading...
Loading...