Summer Health Tips : హాట్ సమ్మర్లో.. ఈ ఫుడ్ ట్రై చేయండి
Updated: May 25, 2023, 11:32 AM |
Published: May 25, 2023, 11:07 AM
Published: May 25, 2023, 11:07 AM

Summer Health Tips : ఎండలు మండిపోతున్నాయి. ఈ మండే ఎండల్లో నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల భోజనం చేయాలనిపించదు. అలాగని తినకుండా ఉండలేం. అయితే వేసవిలో మన ఫుడ్ మెనూని కాస్త ఛేంజ్ చేస్తే శరీరం డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటుంది. మరి సమ్మర్లో ఆరోగ్యాన్ని కాపాడే మెనూ ఏంటో ఓసారి చూద్దామా..?

1/ 9
Summer Health Tips : ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ మండే ఎండలకు త్వరగానే.. అలసట, నీరసం, నిస్సత్తువ ఆవహిస్తోంది. అలాంటప్పుడు ఈ అలసటను పోషకాహారం, పానీయాలతో అధిగమించొచ్చని నిపుణులు చెబుతున్నారు. పోషకాలుండే సమతుల ఆహారం తీసుకోవడం వల్ల ఎండాకాలంలో శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు.
ముఖ్యంగా ఈ సమ్మర్లో మనం తినే రోజూవారి అలవాట్ల కంటే కొంచెం తేలికపాటి మెనూను సిద్ధం చేసుకోవాలి. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కొన్ని రోజులు దూరం ఉంచాలి. నీరు ఎక్కువ శాతం అధికంగా ఉండే ఆకుకూరలు, కూరగాయాలతో చేసిన పదార్థాలు తినడం ఆరోగ్యానికి మంచిది.
సమ్మర్లో సలాడ్లు తినడానికి చాలామంది ఇష్టపడతారు. సలాడ్ ఇష్టపడే వారు సమ్మర్లో కీరదోస, క్యారెట్, క్యాబేజీ, ఉల్లి, టమాటా ముక్కలు, పెరుగు ఉన్న సలాడ్లు తింటే శరీరం చల్లగా ఉంటుంది. అన్నం కూరలు రొటీన్‌గా కాకుండా లెమన్ రైస్, కొత్తిమీర రైస్, పుదీనా రైస్, పాలక్రైస్ చేసుకుని తినడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. మధ్యాహ్నం మాంసాహారం తినకపోవడమే మేలు.
ఇప్పుడున్న ఉష్ణోగ్రతలను బట్టి రోజు అన్నం తిన్న తరువాత ఒక పండు తినడం తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ కాలంలో దొరికే మామిడి, తర్బూజ, పైనాపిల్, బొప్పాయి లాంటివి తీసుకుంటే ఆ పండ్లు శరీర ఉష్ణోగ్రతను సమానంగా ఉంచుతాయని చెబుతున్నారు. భోజనం చివరిలో పెరుగన్నం, లేదంటే మజ్జిగ తీసుకోవడంతో శరీరానికి తగినంత సోడియం, పొటాషియం అంది నిస్సత్తువ దరికి చేరనీయకుండా చేస్తుందని అంటున్నారు.

Loading...