అమ్మాయిలపై నే కాదు ఆడ బొమ్మలపైనా రాక్షసత్వం అందుకే బొమ్మల మొహాలకూ కవర్లు
Published on: Jan 21, 2023, 4:22 PM IST |
Updated on: Jan 21, 2023, 4:22 PM IST
Updated on: Jan 21, 2023, 4:22 PM IST

సమాజంలో ఆడా మగ సమానం. ఇది ఈ భూ ప్రపంచంలో ఎక్కడైనా ఒక్కటే. కానీ అక్కడ అమ్మాయిలే కాదు ఆడ బొమ్మలకూ ఆంక్షలు ఉన్నాయి. 2021 ఆగస్టులో అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నప్పటి నుంచి అక్కడ అరాచక పాలన కొనసాగుతోంది. తాజాగా తాలిబన్లు తీసుకున్న మరో నిర్ణయం నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు కచ్చితంగా బుర్ఖా ధరించాల్సిందేనని తాలిబన్ పాలకులు ఆదేశాలు జారీ చేశారు. కళ్లు మాత్రమే కనిపించాలని , మిగతా శరీర భాగాలన్నీ కప్పి ఉంచేలా బుర్ఖా ధరించాలంటూ కఠినమైన నియమాలు విధించారు. వాళ్లపై అనేక ఆంక్షలు విధిస్తూ అణగదొక్కుతోంది. అమ్మాయిలు హైస్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకోకుండా నిషేధం విధించింది. జిమ్‌లు, పార్కులకు వెళ్లకుండా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇప్పటివరకు అమ్మాయిలపై ఆంక్షలు విధించిన తాలిబన్ సర్కార్.. తాజాగా ఆడ బొమ్మలపై కూడా వివక్ష చూపుతోంది. వస్త్ర దుకాణాల్లో కస్టమర్లను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసే అమ్మాయిల బొమ్మల మొహాలు కన్పించొద్దని ఆదేశించింది. ఈ మేరకు దుకాణ యజమానులకు హుకుం జారీ చేసింది. దీంతో షాపింగ్ మాల్స్‌లోని అమ్మాయిల బొమ్మల మొహాలకు వస్త్రం లేదా పాలిథీన్ కవర్లను కట్టారు యజమానులు. ఆడ బొమ్మల మొహాలు కన్పించకుండా జాగ్రత్త పడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తాలిబన్ల నిర్ణయం పై నెటిజన్లు మండిపడుతున్నారు.
1/ 14
Shops in Afghanistan

Loading...