తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కోటీశ్వరులు వీరే!
Richest Person in Telangana MLA Candidates Participate : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్ వేసిన నాయకుల్లో పలువురు కోటీశ్వరులు ఉన్నారు. వారిలో ఎక్కువగా అధికార పార్టీ నేతలే ఉన్నారు. వారెవరో ఇప్పుడు ఓసారి చూద్దాం.

1/ 13
Richest Person in Telangana MLA Candidates Participate : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాలో పలువురు కోటీశ్వరులు ఉన్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీ అభ్యర్థులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. సదరు అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు సమర్పించిన నామినేషన్ పత్రాల్లో ఆస్తుల వివరాలను(MLA Candidates Financial Details) పొందుపరిచారు.
Telangana Assembly Elections : ఇందులో అత్యధికంగా ఎక్కువ అస్తి ఉన్న వ్యక్తిగా నాగర్ కర్నూల్ జిల్లాలోని బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న మర్రి జనార్ధన్‌రెడ్డి నిలిచారు. ఇతని కుటుంబ ఆస్తి విలువ రూ.112.23 కోట్లుగా చూపించారు. అనంతరం రెండో స్థానంలో నారాయణపేట బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్‌రెడ్డి. తన కుటుంబ ఆస్తి విలువ రూ. 110.15 కోట్లు పేర్కొన్నాడు. రూ.73.60 కోట్లతో మూడో స్థానంలో దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. వీరితో పాటు పలువురు అభ్యర్థులు రూ. కోట్లు ఆస్తిపాస్తులు కలిగి ఉన్నారు. వారిలో పలువురు గుత్తేదారులుగా, విద్యాసంస్థల అధిపతులుగా, స్థిరాస్తి రంగాలకు చెందిన వారిగా, వస్త్ర వ్యాపారులుగా ఉన్నారు.
Loading...
Loading...
Loading...