వారాహి గద సారథి బెజవాడలో జనసేనాని చిత్రాలు
Published on: Jan 25, 2023, 4:01 PM IST |
Updated on: Jan 25, 2023, 4:18 PM IST
Updated on: Jan 25, 2023, 4:18 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వాహనం వారాహిపై వెళ్లి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం తర్వాత కొండదిగువన విజయగణపతి ఆలయం వద్ద వారాహి గుమ్మడికాయ కొట్టి దిష్టి తీయించారు. అనంతరం వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. తనను చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులు జనసేన కార్యకర్తలను ఉద్దేశించి పవన్ మాట్లాడారు. నిన్న తెలంగాణలోని కొండగట్టులో వారాహికి పూజలు చేయించామన్న పవన్ ఇవాళ దుర్గమ్మ ఆశీస్సులు తీసుకునేందుకు విజయవాడకు వచ్చినట్టు చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన జనసేనాని అమ్మవారికి పసుపు కుంకుమ చీర గాజులు పూలు పండ్లు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన కొనసాగుతోందన్న పవన్ ఆ పాలనను అంతం చేయడమే లక్ష్యంగా వారాహి ముందుకు సాగుతుందని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించేదే వారాహి అన్న పవన్.. ఈ ప్రచార రథం విజయ తీరాల వైపు ప్రయాణించనుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఇంద్రకీలాద్రి నుంచి మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వారాహి వాహనంపై పవన్ కల్యాణ్ పయనమైన సమయంలో మోడల్ అతిథి గృహం ఎదురుగా జనసైనికులు గజమాలతో పవన్ కల్యాణ్‌కు వారాహి వాహనానికి స్వాగతం పలికారు. పవన్ వెంట జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పోతిన మహేష్ తదితరులు ఉన్నారు. వీరికి ఆలయ మర్యాదలతో దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో దర్భముళ్ల భ్రమరాంబ ఆలయ అధికారులు పండితులు స్వాగతం పలికారు.
1/ 18
ఇంద్రకీలాద్రిపై గధతో పవన్ కల్యాణ్

Loading...